Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా రహస్య ప్లాన్ లీక్..!
ఉక్రెయిన్ యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహంపై అమెరికా-నాటో సిద్ధం చేసిన ప్రణాళికలు లీకయ్యాయి. ఇవి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్‌డెస్క్: వేసవిలో రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్(Ukraine)కు అమెరికా(USA), నాటో (NATO)దేశాలు ఎటువంటి సాయం చేయాలో క్షుణ్ణంగా సిద్ధం చేసిన ప్రణాళిక లీకైంది. ఇది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా (USA) పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ భద్రతా వైఫల్యాన్ని తాము పరిశీలిస్తున్నమని పెంటగాన్ వెల్లడించింది. ‘‘మాకు ఆ సోషల్ మీడియా పోస్టుల విషయం తెలుసు. ఈ విషయాన్ని మా శాఖ విశ్లేషిస్తోంది’’ అని పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ వివరణ ఇచ్చారు.
అమెరికా-నాటో వ్యూహ పత్రం ట్విటర్, టెలిగ్రామ్‌ల్లో దర్శనమిస్తోంది. దీనిలో ఛార్టులు, ఆయుధ డెలివరీల వివరాలు, బెటాలియన్ బలాలు, ఇతర సున్నితమైన సమాచారం ఉంది. ఈ పత్రం కనీసం 5 వారాల కిందటిదిగా తెలుస్తోంది. దీనిలో ఏప్రిల్ 1 తేదీ వరకు ప్లానింగ్ క్షుణ్ణంగా ఉంది. 12 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు శిక్షణ వివరాలు కూడా ఉన్నాయి. వీటిల్లో తొమ్మిది బ్రిగేడ్లకు అమెరికా-నాటో శిక్షణ ఇచ్చాయి. ఉక్రెయిన్‌కు 250 ట్యాంకులు, 350 మోటరైజ్డ్ బ్రిగేడ్లు అవసరమని గుర్తించారు.
లీకైన పత్రాల్లో ఒక టాప్ సీక్రెట్ డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది రష్యా(Russia) అనుకూల ప్రభుత్వ ఛానల్స్‌లో తిరుగుతోంది. దీంతోపాటు ఉక్రెయిన్ ఆధీనంలోని ప్రాంతాల్లో మందుగుండు ఖర్చును కూడా ఈ పత్రాల్లో వెల్లడించారు. వీటిల్లో హిమార్స్ రాకెట్ వ్యవస్థల ఖర్చు కూడా ఉంది. ఈ పత్రాలను కొందరు పశ్చిమ దేశాల నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వీటిల్లో ఉక్రెయిన్ బలగాల నష్టాలను ఎక్కువగా.. రష్యా బలగాల నష్టాలను తక్కువగా చూపుతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి