Balakrishna: ఏపీలో మళ్లీ సైకో పాలన వస్తే.. ప్రజలు వలసపోవాల్సిందే: నందమూరి బాలకృష్ణ

వైకాపా పాలనలో ఏపీ సర్వనాశనమైందని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు.

Updated : 07 Apr 2023 12:42 IST

శింగనమల: వైకాపా పాలనలో ఏపీ సర్వనాశనమైందని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. మార్తాడులోని క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. గతంలో యువత కోసం తెదేపా ఏం చేసిందో ఆయన చెబుతున్నారని.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

‘‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వలసపోవాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది. వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు. తెదేపాలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైకాపా ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైకాపా అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. తెదేపా పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని బాలయ్య అన్నారు.

యువగళం పాదయాత్రలో బాలయ్య.. ఫొటో గ్యాలరీ

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు