Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jul 2023 13:07 IST

1. ఇదిగో బెయిర్‌స్టో ఔట్.. అరెరె ‘శాండ్‌పేపర్‌’ తేవడం మరిచిపోయానే!

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ (Ashes Series) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ఇంగ్లాండ్‌ వేదికగా యాషెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి టెస్టు సందర్భంగా ఏదొక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. క్యాచ్‌లు, ఔట్ చేసిన తీరు, ఎంసీసీ సభ్యులే ఆసీస్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూశాం. ఇరుదేశాల అభిమానులు దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్‌

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఓ విమానం (Aircraft) సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది.. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. KTR: 3 పంటలా.. 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి: KTR

రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ‘‘కేసీఆర్‌ నినాదం.. మూడు పంటలు.  కాంగ్రెస్‌ విధానం.. మూడు గంటలు. భాజపా విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది  రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. kollywood: పాదయాత్ర ప్రారంభించనున్న స్టార్‌ హీరో విజయ్‌ ..!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ (Thalapathy Vijay) పాదయాత్రకు సన్నద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఈ న్యూస్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉత్తరభారత్‌లో భారీ వర్షాలు.. 100 మందికిపైగా మృతి

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. హిమాచల్‌ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికాను బెదిరించి.. ఆపై క్షిపణి ప్రయోగం..

కొరియా ద్వీపకల్పం మరోసారి ఉద్రిక్తంగా మారింది. అమెరికాను బెదిరించిన మర్నాడే ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ విషయాన్ని జపాన్‌, ఉత్తరకొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడింది. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని ఆ దేశ కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పంచాయతీ ఎన్నికల్లో దీదీ జోరు.. 34వేల స్థానాల్లో టీఎంసీ గెలుపు

పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. టీఎంసీ ఏకంగా 34,560 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 705 చోట్ల ఆధిక్యంలో ఉంది. 
తన ప్రధాన ప్రత్యర్థి భాజపా 9,621 స్థానాల్లో గెలిచి.. మరో 169 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంపద సృష్టితో పేదరికం పోగొట్టాలి: చంద్రబాబు

పూర్‌ టు రిచ్‌ అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా మినీ మేనిఫెస్టోలోని పూర్‌ టు రిచ్‌ విధానం వినూత్నమైందని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ-4 విధానమన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరమన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని.. సంపద సృష్టి ద్వారా అది మార్చాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎండీ, సీఈవో హత్య కేసులో హంతకులు మాజీ ఉద్యోగులే..

బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ కంపెనీ ఎండీ, సీఈవోను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ కంపెనీని వీడి కొత్త కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులే ఈ హత్య చేసినట్లు తేలింది. తమ కొత్త కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొంటున్నారనే అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్లోని ‘ఎయిర్‌ ఆన్‌ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌’ సీఈఓ వినుకుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫణీంద్ర సుబ్రహ్మణ్య మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రేవంత్‌ క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్‌ నేతలను తిరగనీయొద్దు: ఎమ్మెల్సీ కవిత

రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద భారాస (BRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారాస నేతలు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని