KTR: 3 పంటలా.. 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి: KTR

రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

Updated : 12 Jul 2023 11:14 IST

హైదరాబాద్: రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ‘‘కేసీఆర్‌ నినాదం.. మూడు పంటలు.  కాంగ్రెస్‌ విధానం.. మూడు గంటలు. భాజపా విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది  రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

‘‘కాంగ్రెస్‌ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామన్నారు. ఇప్పుడు 3 గంటల విద్యుత్‌ చాలని.. రైతుకు మూడుపూటలా విద్యుత్‌ ఎందుకు అంటున్నారు. ముమ్మాటికీ ఇది సన్న, చిన్న కారు రైతును అవమానించడమే. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలవని రాబందును నమ్మవద్దు. మరోసారి మూడు గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? మూడు గంటల విద్యుత్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో రైతులకు తెలుసు’’ అని కేటీఆర్‌ అన్నారు.

‘‘తెలంగాణలో 95 శాతం మంది రైతులకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నందున అందులో పంటల సాగుకు 3 గంటలసేపు కరెంటు ఇస్తే నీరందించవచ్చు. మొత్తంగా వ్యవసాయానికి రోజూ 8 గంటల సేపు విద్యుత్తు చాలు’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు