Kavitha: రేవంత్‌ క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్‌ నేతలను తిరగనీయొద్దు: ఎమ్మెల్సీ కవిత

రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) అన్నారు.

Updated : 12 Jul 2023 14:29 IST

హైదరాబాద్‌: రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్‌ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని విద్యుత్‌సౌధ వద్ద భారాస (BRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారాస నేతలు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్‌ నాణ్యమైన విద్యుత్‌.. కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌ అని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘60 ఏళ్ల పాటు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఎందుకు ఇవ్వొద్దు? పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం రేవంత్‌కు ఉందా?మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు 3 గంటలే విద్యుత్‌ ఇవ్వాలనే రేవంత్‌ను ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి. రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. రేవంత్‌ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగనీయొద్దు’’ అని కవిత మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని