Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Aug 2023 13:13 IST

1. Manish Sisodia: మరింత కాలం జైల్లోనే మనీశ్ సిసోదియా..!

మద్యం కుంభకోణం (Excise policy scam)కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. దీంతో మరింతకాలం ఆయన జైల్లోనే ఉండనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విపక్షాల కూటమి ఇండియా కాదు.. ఘమండియా..!

పార్లమెంట్ సమావేశాలు (Parliament), 2024 లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) దృష్ట్యా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ(Modi) వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం బిహార్‌(Bihar)లోని మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపక్షాల కూటమిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాన్ని సూచించారు. ఆ కూటమిని ఇండియా అని కాకుండా ఘమండియా అని పిలవాలన్నారు. హిందీలో దురహంకారి అని దీని అర్థం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఐటీ రిఫండ్‌.. అని మెసేజ్‌ వచ్చిందా..?’: కేంద్రం హెచ్చరిక

మీకు ఐటీ రిఫండ్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్‌ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్‌ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఐటీ రిఫండ్ల (ITR refund claims) కోసం ఎదురుచూస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘మీ బ్యాంక్‌ ఖాతా నంబర్ తప్పుంది.. వెంటనే సరిచేసుకోండి’ అంటూ మెసేజ్‌లు పంపుతూ డబ్బు కాజేయాలని చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Nuh: నూహ్‌ అల్లర్లు: రంగంలోకి బుల్డోజర్లు.. నిందితుల ఇళ్ల కూల్చివేత

 హరియాణాలోని నూహ్‌ (Nuh) జిల్లాలో అల్లర్లకు కారణమైన నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నూహ్‌ జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించారు. అక్రమంగా వలసవచ్చిన వీరు అల్లర్లలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి గత నాలుగేళ్లలో వలస వచ్చిన వారు ఇక్కడ స్థలాలను కబ్జాచేసి ఈ పూరి గుడిసెలు నిర్మించినట్లు హరియాణా పట్టణాభివృద్ధి శాఖ చెబుతోంది. భారీ ఎత్తున పోలీసు దళాలు శుక్రవారం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సుప్రీం కోర్టులో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

5. KTR: ఐటీలో 27 ఏళ్లలో జరిగింది.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: కేటీఆర్‌

రాష్ట్రంలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని.. కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. స్టేబుల్‌ గవర్నమెంట్‌.. ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది’.. మీనాక్షి లేఖి వివాదాస్పద వ్యాఖ్యలు

అత్యంత వివాదాస్పదమైన ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023)ను లోక్‌సభ (Lok sabha) ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్యే సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఈ బిల్లును దిగువ సభ గురువారం ఆమోదించింది. కాగా.. ఈ చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) ప్రతిపక్షాల (Opposition)ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈసారి ‘బుద్వేల్‌’కు నోటిఫికేషన్‌.. ఎకరాకు కనీస ధర రూ.20కోట్లు

నగరంలోని కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన నేపథ్యంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా.. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మార్గదర్శి కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ అవసరం లేదు: సుప్రీం

 మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని పేర్కొంది. మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై కఠిన చర్యలు వద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

9. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి తిట్లపురాణం

వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తిట్ల పురాణం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. టెక్కలి జడ్పీటీసీగా ఉన్న ఆమెను నియోజకవర్గ వైకాపా అధ్యక్షురాలుగా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ తప్పుడు ప్రచారం చేసినట్లు భావించి అతడిపై ఆమె ఫోన్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.  ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ.. ఆమె ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని