Modi: విపక్షాల కూటమి ఇండియా కాదు.. ఘమండియా..!

ప్రతిపక్షాల కూటమిపై ప్రధాని మోదీ(Modi) విమర్శలు గుప్పించారు. మిత్రపక్షాలతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated : 04 Aug 2023 10:28 IST

దిల్లీ: పార్లమెంట్ సమావేశాలు (Parliament), 2024 లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) దృష్ట్యా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ(Modi) వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం బిహార్‌(Bihar)లోని మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపక్షాల కూటమిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాన్ని సూచించారు. ఆ కూటమిని ఇండియా అని కాకుండా ఘమండియా అని పిలవాలన్నారు. హిందీలో దురహంకారి అని దీని అర్థం.

కేంద్రంలోని అధికార ఎన్డీయేపై పోరుకు జట్టు కట్టిన విపక్షాలు ఇటీవల తమ కూటమి పేరును ఖరారు చేశాయి. ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌(ఐఎన్‌డీఐఏ- ఇండియా) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించాయి.  కేంద్ర సర్కారు అన్ని వ్యవస్థల్ని కాలరాస్తోందనీ, దానికి దీటైన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తాము అందిస్తామని ప్రకటించాయి. ఈ కొత్త పేరుపై, విపక్ష పార్టీలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌పై మోదీ ఇటీవల కాలంలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికరణం 370ని రద్దు చేసే అధికారం పార్లమెంటుకు లేదంటారా..?

‘వారు తమ కూటమి పేరును యూపీఏ నుంచి ఇండియాకు మార్చుకున్నారు. పేదలకు వ్యతిరేకంగా వారు చేసిన కుట్రలను దాచిపెట్టేందుకే ఈ పేరు మార్పు. వారు దేశభక్తితో కాకుండా.. దేశాన్ని దోచుకోవాలనే దురుద్దేశంతో కొత్త పేరు పెట్టుకున్నారు’ అని ఇటీవల మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని