Rana Kapoor: సుప్రీం కోర్టులో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన యెస్‌ బ్యాంక్‌ (Yes Bank) సహ-వ్యవస్థాపకుడు రానా కపూర్‌ (Rana Kapoor)కు సుప్రీం కోర్టు (supreme Court)లో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.

Updated : 04 Aug 2023 12:42 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన యెస్‌ బ్యాంక్‌ (Yes Bank) సహ-వ్యవస్థాపకుడు రానా కపూర్‌ (Rana Kapoor)కు సుప్రీం కోర్టు (supreme Court)లో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన తన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు. అంతకముందు రానా కపూర్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కుదిపేసిందని న్యాయస్థానం పేర్కొంది.

యెస్‌ బ్యాంక్‌ ఏటీ1 బాండ్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు తప్పుగా విక్రయించిన కేసుకు సంబంధించి రూ. 2.2 కోట్లు చెల్లించాలని గత నెలలో రానా కపూర్‌ను సెబీ ఆదేశించింది. ఆగస్టు 8లోపు ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆయనకు చెందిన స్థిర, చరాస్థుల ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మనీ లాండరింగ్‌ కేసులో మార్చి 2020 నుంచి రానా కపూర్‌ జైలులో ఉన్నారు. 2020లో హౌసింగ్ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (HDIL) ప్రమోటర్లు రాకేష్‌ వాధ్‌వన్‌, ఆయన కుమారుడు సారంగ్‌లకు జారీ చేసిన రూ. 900 కోట్ల రుణాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రానా కపూర్‌ను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం పలు మనీ లాండరింగ్‌కు సంబంధించిన పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని