Supreme Court: మార్గదర్శి కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ అవసరం లేదు: సుప్రీం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 04 Aug 2023 13:26 IST

దిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని పేర్కొంది. మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై కఠిన చర్యలు వద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది.

Margadarsi: మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర

కేసులో ఉన్న మెరిట్స్‌ ఆధారంగా తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకే తెలపాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సూచించింది. హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత సుప్రీంకోర్టుకు రావొచ్చని తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు