Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఫేస్‌బుక్.. ఇన్‌స్టాగ్రామ్.. బ్లూ టిక్‌కు ఛార్జీలు
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను మాతృసంస్థ మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఫేస్‌బుక్ వాడితే నెలకు రూ.1,450 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెస్క్‌టాప్ బ్రౌజర్ల వినియోగదారులు నెలకు రూ.1,099 చెల్లించాలని వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో మాత్రమే ఈ బ్లూ టిక్ సౌకర్యం అందుబాటులో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నేను ఎందుకు దాక్కోవాలి?
సమంత తన సినిమా పనులతో మళ్లీ బిజీ అయిపోయారు. ఒక పక్క ‘శాకుంతలం’ ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తూ... మరోవైపు ‘ఖుషి’ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతూ కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు పనిపై దృష్టిపెట్టారు. ‘శాకుంతలం’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ విడాకుల తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పంచుకున్నారు. విడాకుల తర్వాత ‘పుష్ప’లో ప్రత్యేకగీతం చేసే అవకాశం వస్తే, చాలా మంది చెయ్యొద్దని సలహా ఇచ్చినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. లిఫ్ట్ అడుగుతూ.. దేశాన్ని చుట్టేస్తోంది!
పైసా చుట్టూనే ప్రపంచం అంటాం! ప్రయాణాల్లో చీర సౌకర్యవంతం కాదనుకుంటాం. ఇలాంటివే మరికొన్ని నమ్మకాలు. ఇవన్నీ నిజం కాదని తన భారతయాత్రతో నిరూపిస్తోంది సరస్వతి నారాయణ్ అయ్యర్.. ఉన్నది ఒకటే జీవితం.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి. నాలుగు గోడల మధ్య కాలాన్ని వెళ్లదీస్తే దానికి విలువేముంటుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే అద్భుతాలు సాధిస్తాం అనుకుంది సరస్వతి నారాయణ్ అయ్యర్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. స్టెనోగ్రాఫర్ పోస్టులకు పోటీ పడతారా?
నియామకం జరగనున్న 185 పోస్టుల్లో ఎస్సీలకు 28, ఎస్టీలకు 14, ఓబీసీలకు (ఎన్‌సీఎల్) 50, ఈడబ్ల్యూఎస్‌లకు 19, అన్ రిజర్వుడ్‌కు 74 కేటాయించారు. అభ్యర్థులు పన్నెండో తరగతి పాసై స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఫేజ్-1లో రాత పరీక్ష, ఫేజ్-2లో స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కొవిడ్‌పై ‘అణ్వ’స్త్రం
కొవిడ్‌ను కలిగించే సార్స్‌కోవ్2 వైరస్‌తో పాటు దాని రూపాంతరాలైన డెల్టా, ఒమిక్రాన్‌ల పనిపట్టే మాలిక్యూల్(అణువు)ను అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఫైజర్ సంస్థ విడుదలచేసిన ప్యాక్స్‌లోవిడ్ మాత్రలను కొవిడ్ లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజుల్లో వాడితేనే ఫలితం కనిపిస్తుంది. హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టిన సి.డి.04872ఎస్.సి. మాలిక్యూల్ కొవిడ్ కారక వైరస్‌పై తక్షణం పనిచేసి దాని ఆటకట్టిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రామాయణం.. చెబుతోంది జీవిత పాఠం!
రామాయణం.. జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. ఇందులోని ఏడు కాండలను చదివితే మన జీవితానికి ఉపయుక్తమైన వ్యక్తిత్వ అంశాలు నేర్చుకోవచ్చు. బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు ప్రతిదీ మన జీవితానికి అన్వయించుకొని గొప్ప విజయాలు సాధించొచ్చు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏ కాండం నుంచి ఏం నేర్చుకోవచ్చో వివరిస్తూ ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రతి నెలా ఇంధన సర్దుబాటు ఛార్జీలు
ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి వసూలు చేస్తుండగా... ఇకపై ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలా డిస్కంలకు అనుమతిస్తూ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరీలకు యూనిట్‌కు 40 పైసలు చొప్పున వసూళ్లు చేసుకునే ప్రతిపాదనకు డిస్కంలకు అనుమతిస్తూ బుధవారం గెజిట్ ప్రచురించింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌కు సవరణ చేసింది. ఫిబ్రవరి 10న ముసాయిదా సవరణ ప్రచురించి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఓ మహిళ భగీరథ ప్రయత్నమే చేసింది. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా, ఫీజుల రూపంలో ఎంత డబ్బు ఖర్చవుతున్నా వెనుకడుగు వేయలేదు. చివరకు 960 ప్రయత్నాల తర్వాత లైసెన్స్ సంపాదించింది. ఆమెనే దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆమె తొలిసారిగా 2005లో రాత పరీక్ష రాసి ఫెయిల్ అయింది. ఆ తర్వాతి రోజు నుంచి వారానికి ఐదు రోజుల చొప్పున మూడేళ్లలో 780 సార్లు పరీక్ష రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అయిననూ హస్తినకు పోయిరావలె
రెండు వేల పెద్ద లడ్డూలు పంపినా, పని జరగక ‘అయిననూ హస్తినకు పోయి రావాలంటూ’ ముఖ్యమంత్రి ఎందుకు దిల్లీకి వెళుతున్నారో ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావం, తన పుట్టినరోజు వేడుకల అనంతరం జరిగిన సభలో ఉమా మాట్లాడారు. బాబాయ్ హత్య కేసులో తన ఎంపీ తమ్ముడిని కాపాడుకోవడానికే సీఎం దిల్లీకి కాళ్ల బేరానికి వెళుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తుండటంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
SSC Results: 35 శాతంతో ‘పది’ పాస్.. పిల్లాడి తల్లిదండ్రుల సందడే సందడి!
-
India News
Brij Bhushan: మహిళా రెజ్లర్‌తో.. బ్రిజ్‌భూషణ్ ఇంటి వద్ద సీన్ రీక్రియేషన్..!
-
Sports News
Virat Kohli: అప్పుడే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం: విరాట్ కోహ్లీ మెసేజ్
-
India News
Pratik Doshi: నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ ఎవరో తెలుసా?
-
General News
viveka Murder case: వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ నిరాకరణ
-
Politics News
Chandrababu: కేసుల నుంచి జగన్ బయటపడేందుకే పూజలు, యాగాలు..: చంద్రబాబు