లిఫ్ట్‌ అడుగుతూ.. దేశాన్ని చుట్టేస్తోంది!

పైసా చుట్టూనే ప్రపంచం అంటాం! ప్రయాణాల్లో చీర సౌకర్యవంతం కాదనుకుంటాం. ఇలాంటివే మరికొన్ని నమ్మకాలు. ఇవన్నీ నిజం కాదని తన భారతయాత్రతో నిరూపిస్తోంది సరస్వతి నారాయణ్‌ అయ్యర్‌.. 

Published : 30 Mar 2023 00:26 IST

పైసా చుట్టూనే ప్రపంచం అంటాం! ప్రయాణాల్లో చీర సౌకర్యవంతం కాదనుకుంటాం. ఇలాంటివే మరికొన్ని నమ్మకాలు. ఇవన్నీ నిజం కాదని తన భారతయాత్రతో నిరూపిస్తోంది సరస్వతి నారాయణ్‌ అయ్యర్‌.. 

న్నది ఒకటే జీవితం.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి. నాలుగు గోడల మధ్య కాలాన్ని వెళ్లదీస్తే దానికి విలువేముంటుంది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వస్తేనే అద్భుతాలు సాధిస్తాం అనుకుంది సరస్వతి నారాయణ్‌ అయ్యర్‌..

దిల్లీకి చెందిన ఈమె ఓ బీమా కంపెనీలో సేల్స్‌ అసోసియేట్‌గా పనిచేసేది. దేశాన్ని చుట్టి రావాలనే కోరికతో ఉద్యోగాన్ని వదిలి మరీ ‘భారత్‌ యాత్ర’ చేస్తోంది. అనుకుందే తడవు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ప్రయాణానికి రూపాయి కూడా ఖర్చు కాకూడదని భావించింది. లిఫ్ట్‌ అడిగి మాత్రమే ప్రయాణించాలని నియమం పెట్టుకుంది. వెంట ఒక క్యాంపు టెంట్‌, రెండు చీరలు, 2 నైట్‌ డ్రెస్‌లు, లిఫ్ట్‌ అడగడానికి బోర్డులు, తినడానికి కొన్ని చిరుతిళ్లు మాత్రమే తీసుకొని వెళ్లింది. దారిలో ప్రకృతిని ఆస్వాదించడంతోపాటు.. వ్యవసాయం తీరుతెన్నులూ తెలుసుకుంటోంది. వివిధ రాష్ట్రాల భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, వంటలు నేర్చేసుకుంటోంది. చారిత్రక కట్టడాలనూ సందర్శిస్తోంది. ఇప్పటికి 145 రోజుల్లో మొత్తం 22 రాష్ట్రాల్లో పర్యటించింది. ప్రయాణం అంతా చీర కట్టులోనే సాగిస్తుండటం ఈ యాత్ర విశేషం. అడిగితే ‘చీరే నాకు సౌఖ్యంగా ఉంటుంద’ని చెబుతోందీమె. సంతోషం ఖరీదైన దుస్తులు, వస్తువుల్లోనే ఉంటుందనుకుంటే పొరపాటంటూ స్ఫూర్తి పాఠాలు చెబుతోందీ హిచ్‌ హైకర్‌. దారి పొడవునా లిఫ్ట్‌ అడిగి ప్రయాణించేవాళ్లని ఇలా పిలుస్తారు.  ఇప్పటివరకూ సాగిన తన ప్రయాణం గురించి చెప్పమంటే ‘మహిళలు ఒంటరిగా ప్రయాణించడానికి మన దేశం ఎంతో సురక్షితమైనది. అనుకున్నది సాధించడానికి పరిస్థితులు అడ్డుకావు. భయాన్ని వదిలి ధైర్యంగా అడుగు బయట పెట్టాలి.. ప్రేమించడానికి, ఆనందించడానికీ డబ్బుతో పనిలేదం’టోంది సర్వసతి. ఈ ప్రయాణం మొత్తానికి ఇప్పటి వరకూ ఈమెకు అయిన ఖర్చు రూ.1450 మాత్రమేనట. ఈమె సాహస ప్రయాణం ఎందరికో ఆదర్శం కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్