Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Sep 2021 09:12 IST

1. బ్యాటు.. రక్షిస్తుందా?

చకచకా నాలుగైదు వికెట్లు తీయడం.. ఆ తర్వాత పట్టు విడవడం.. కింది వరుస బ్యాట్స్‌మెన్‌ వికెట్లు పడగొట్టలేక ఆపసోపాలు పడటం.. భారత బౌలర్లను దశాబ్దాలుగా వెంటాడుతున్న జాఢ్యం ఇది! ఈ మధ్య ఈ బలహీనతను కాస్త వదిలించుకున్నట్లే కనిపించినా.. ఇప్పుడది తిరిగొచ్చి ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో జట్టును గట్టి దెబ్బ కొట్టింది. తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ చేసిన గాయాలకు బౌలర్లు మందు రాసి, జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చేలా కనిపించిన బౌలర్లు.. మధ్యలో కాడి వదిలేయడంతో భారత్‌ 99 పరుగుల విలువైన ఆధిక్యం కోల్పోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆందోళనకరంగా ఆర్‌-విలువ

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను సూచించే ఆర్‌-విలువ (రీ ప్రొడక్షన్‌ నంబర్‌) దేశంలో ‘1’ దాటిపోయింది. ఆగస్టు 14-17 తేదీల మధ్య 1 కంటే తక్కువగా (0.89) ఉన్న ఆర్‌-విలువ 24-29 తేదీల సరికి ఏకంగా 1.17కి చేరినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు వెల్లడించారు. గత నెల ప్రథమార్థంలో క్రమేపీ తగ్గుతూ వచ్చిన ఆర్‌-విలువ ద్వితీయార్థంలో ఒక్కసారిగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

15 నుంచి ‘జైకోవ్‌-డి’ టీకా

3. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొలువుల సందడి

 దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నియామకాల సందడి నెలకొనబోతోంది. ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని వర్సీటీల ఉపకులపతులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు. అందుకు నిర్ణీత గడువును నిర్దేశించారు. ఈ నెల 10వ తేదీకల్లా ఉద్యోగాల ప్రకటనలను వెలువరించి అక్టోబరు చివరికల్లా నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 6,229 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Madanapalle: పదిమంది విద్యార్థులకు కరోనా

కురబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. 11 మందికి పాజిటివ్‌ రావడంతో వైద్య బృందం వెళ్లి వైద్య సేవలు అందించినట్లు కురబలకోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనుహ్య తెలిపారు. ఇక్కడ చదువుతున్న 10 మంది విద్యార్థులు, డైనింగ్‌ హాల్‌ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!

కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డిస్కంలకు ‘పవర్‌’ కట్‌

6. పెండింగ్‌ చలాన్ల బంపర్‌ ఆఫర్‌... నిజం కాదు!

ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ-చలాన్లు పంపిస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా చాలా వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, రూ.వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ‘దసరా పండగ’ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో  ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రేమించి.. తప్పు చేశా

నా పేరు స్వీటీ. చిన్నప్పట్నుంచి నాన్న ఓ మాట చెబుతుండేవారు. ‘చదువే మనకు ఆస్తి.. అదుంటే ఏదైనా సాధించవచ్చు’ అని. అందుకే చదువు నాకు ఆరోప్రాణమైంది. నన్ను ర్యాంకర్‌ని చేసింది. డిగ్రీ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా చేసింది. జాబ్‌ చేయగలనో, లేదో అని కొత్తలో భయమేసేది. అప్పుడు మిక్కీ అండగా నిలిచాడు. ఇద్దరిదీ సేమ్‌ కేడర్‌. బాగా సహకరించేవాడు. కాకపోతే తను సైలెంట్‌. అమ్మాయిలంటే గౌరవం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇల్లు కొనేటప్పుడు ఏం చూస్తున్నారు?

ఇల్లు, ప్లాట్ల కొనుగోలుదారులకు బిల్డర్లు, రియల్టర్ల నుంచి మిశ్రమ అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు చెప్పిన ప్రకారం పనులు పూర్తి చేసి యజమానికి స్థిరాస్తిని అప్పగిస్తే.. మరికొందరు  ప్రాజెక్టు ఆఖరులో పనులన్నీ వదిలేసి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ అనుభవాలతో కొనుగోలుదారులు డెవలపర్‌ విశ్వసనీయతను ప్రధానంగా చూస్తున్నారు. కొత్త ఇంటిని, ప్లాట్‌ను ఎంపిక చేసుకునే సమయంలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేశారా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆధునిక జీవన శైలికి చిరునామా

9. బీటెక్‌ చదవని.. టెక్‌ గురూ

గణేశ్‌ ఇంజినీరింగ్‌ చదవలేదు. ఇంగ్లిషు అసలే రాదు. కానీ చిన్నతనం నుంచి ఒకటే తపన. సాటి మనుషుల సమస్యలకు పరిష్కారం చూపించాలనుకునేవాడు. ఆ తపనే ప్రయోగాల వైపు అడుగులు వేయించింది. 25 సరికొత్త ఆవిష్కరణలు చేయించింది. గ్రామీణ ఆవిష్కర్తగా దేశం మెచ్చే పేరు తెచ్చిపెట్టింది. తనది నిరుపేద కుటుంబమైనా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికాలోని తెలుగువారికి ఇక్కట్లు

ఇడా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 46కు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలూ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఒకరిద్దరు గల్లంతైనట్లు నిర్ధారణ కాని వార్తలు వస్తున్నాయని అక్కడి ప్రవాసాంధ్రులు తెలిపారు. ముఖ్యంగా న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్‌, గ్లోసస్టర్‌, సోమర్‌సెట్‌ వంటి కౌంటీల్లోని వివిధ నగరాల్లో స్థిరపడిన కొందరి తెలుగువారి ఇళ్ల బేస్‌మెంట్లలోకి నీళ్లు వచ్చేశాయని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని