Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Nov 2021 09:11 IST

1. China-Taiwan: తైవాన్‌కు అండగా.. యూరోపియన్‌ యూనియన్‌!

తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని డ్రాగన్‌ దేశం చైనా ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనా వైమానిక దళం తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలోకి చొరబడింది. కాగా.. తైవాన్‌కు సమస్యలు తలెత్తితే తాము అండగా ఉంటామని అమెరికా గతంలోనే వెల్లడించింది. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ కూడా తైవాన్‌కు భరోసా కల్పిస్తోంది. యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుల బృందం మూడు రోజులపాటు తైవాన్‌లో పర్యటించేందుకు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Karthika masam: కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ప్రదోషకాలమనందు చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని ఇస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. WhatsApp: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. మెసేజ్‌ డిలీట్.. టైమ్‌ లిమిట్‌ మారుతోంది..! 

యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్‌ ఎవ్రీన్‌వన్‌ ఫీచర్‌ టైమ్‌ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి వ్యక్తుల చాట్‌ పేజ్‌ నుంచి సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Road Accident: అనంతపురం జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి దుర్మరణం

అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Team India: భారత్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవమే.. ఎలాగో తెలుసా?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. గతరాత్రి అఫ్గానిస్థాన్‌ను దంచికొట్టి ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌ ఆశలను నిలుపుకొంది. పోటీలో నిలవాలంటే తప్పక గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. గతరెండు మ్యాచ్‌ల్లాగే మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Team India: అఫ్గానిస్థాన్‌పై టీమ్‌ఇండియా భారీ ఆశలు: అశ్విన్

6. అమెరికాలోనూ దీపావళి.. న్యూయార్క్‌లో బాణసంచా వెలుగులు జిగేల్‌!

భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో అమెరికా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్‌ డెమోక్రటిక్‌ క్లబ్‌లో పలువురు ప్రముఖులు దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భారత సంతతి అమెరికన్లు, అమెరికన్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై తొలిసారిగా దీపావళి థీమ్‌ని ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి

మన దేశంలో స్టాక్‌ మార్కెట్లలోకి వచ్చే రిటైల్‌ మదుపర్ల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచంలోనే అత్యంత కనిష్ఠమని చెప్పాలి. చాలా మంది చిన్న మదుపర్లు షేర్లలోకి దిగకుండా.. మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గు చూపిస్తారు. షేర్లతో కూడిన పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. దానికి కారణం నష్టభయమే. తక్కు వ నష్టభయంతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి మంచి ప్రతిఫలాలు అంటే స్థిరమైన ప్రతిఫలాలను పొందడం అన్నది ఒక కళ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. T20 World Cup: వెస్టిండీస్‌పై శ్రీలంక విజయం

కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న వెస్టిండీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు చేజార్చుకున్న శ్రీలంక జట్టు వెస్టిండీస్‌ను ఓడించి దాని సెమీస్‌ ఆశలను వమ్ముచేసింది. 5 మ్యాచ్‌ల్లో శ్రీలంక కేవలం రెండు విజయాలు సాధించి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక సూపర్‌ 12 గ్రూప్‌ 1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా, రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Karnataka: లంచం కేసు.. సగం యూనిఫాంతో ఎస్సై పరుగో పరుగు!

సాధారణంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్‌ చేస్తారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు రివర్స్‌ జరగడం విశేషం. ఇక్కడ ఓ ఎస్సైని పట్టుకునేందుకు అనిశా అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. కారణం.. ఆ ఎస్సై లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడమే. తుమకూరు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సగం యూనిఫాంలో ఉన్న ఆ ఎస్సైని దాదాపు కిలోమీటరు దూరం వెంబడించి, ఎట్టకేలకు ప్రజల సాయంతో పట్టుకోగలిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Cinema news: ఒక్క పంచ్‌ డైలాగ్‌ లేదు.. విజువల్స్‌తో కట్టిపడేశారు!

తమ హీరో సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌లు ఎప్పుడు వస్తాయా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. టీజర్‌, ట్రైలర్‌ విడుదలైతే ఎన్ని క్లోజప్‌ షాట్‌లు పడ్డాయి? ఎన్ని గెటప్‌ల్లో కనిపించాడు? పంచ్‌ డైలాగ్‌లేంటి? ఇలా లెక్కలేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తారు. కానీ, త్వరలో విడుదల కాబోయే కొన్ని చిత్రాలు ప్రచారం విషయంలో కొత్త పంథా అనుసరిస్తున్నాయి. హీరోల పంచ్‌ డైలాగ్‌లతో పని లేకుండా ‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అన్నట్టు కేవలం విజువల్స్‌తో టీజర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని