Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 Mar 2024 21:00 IST

1. మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం: రేవంత్‌రెడ్డి

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చంద్రబాబు దిల్లీ పర్యటన ఖరారు.. పొత్తులపై చర్చించే అవకాశం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులో భాగంగా ఆయన దిల్లీలో కీలక మంతనాలు జరపనున్నట్టు సమాచారం. పొత్తు అంశంతో పాటు దిల్లీ పరిణామాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఈరోజు ఉదయం గంటన్నరపాటు సమావేశమైన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ యువకుడి మృతి

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు బలైపోయాడు. రష్యా తరఫున పోరాడుతూ మహ్మద్‌ అఫ్సాన్‌ (30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ మోసం చేశారు.. జనసేనలో చేరుతున్నా: చిత్తూరు ఎమ్మెల్యే

బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వరికి బోనస్‌ ఇవ్వకుండా ఎలా ఓట్లు అడుగుతారు?: హరీశ్‌రావు

తమ ఎంపీలను భాజపా లాగేసుకుంటోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ‘‘100 రోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. వైట్‌ పేపర్‌, బ్లాక్‌ పేపర్‌ అంటూ మోదీకి లవ్‌ లెటర్‌ తప్పితే మీ పాలనలో ఏముంది?’’ అని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ సర్వీసుల్లో 10% డిస్కౌంట్‌

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాది పొరపాటే.. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు నటి సౌమ్య జాను

బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట నటి సౌమ్య జాను బుధవారం విచారణకు హాజరయ్యారు. రెండు వారాల క్రితం జరిగిన ఘటనపై ఐదు గంటలపాటు ఆమెను విచారించిన పోలీసులు.. నోటీసు ఇచ్చి పంపించారు. ఫిబ్రవరి 24న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నం.12లో రాంగ్‌రూట్‌లో వచ్చిన సౌమ్య జాను కారును హోంగార్డు అడ్డుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హైడ్రామాకు తెర.. ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను పోలీసులు ఎట్టకేలకు సీబీఐకి అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో అతడిని, కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాల్సిందేనంటూ కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గ్యాంగ్‌స్టర్ల ప్రేమ.. 6 గంటలు పెరోల్‌పై బయటకు వచ్చి పెళ్లి..!

కొద్ది రోజుల్లో గ్యాంగ్‌స్టర్ల(Gangsters) జంట ప్రేమ వివాహం చేసుకోనుంది. కొన్ని గంటల పాటు పెరోల్‌పై బయటకు వచ్చి ఈ బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ విషయం వైరల్ అవుతోంది. రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడమ్ మింజ్‌,  హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్ కాలా జథేడీ.. మార్చి 12న సోనిపత్‌లో పెళ్లి చేసుకోనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిరుతను గదిలో బంధించిన బాలుడు.. వీడియో వైరల్‌

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడు.. తన తెలివితో ఏకంగా ఓ చిరుతను గదిలో బంధించాడు. మాలెగావ్ పట్టణంలో మోహిత్ విజయ్ అనే పిల్లాడు తన ఇంట్లో మొబైల్‌లో గేమ్ ఆడుకుంటున్నాడు. అంతలోనే ఆ ఇంట్లోకి అకస్మాత్తుగా ఓ చిరుతపులి ప్రవేశించింది. ఆ చిరుతను చూసిన పిల్లాడు భయపడకుండా.. గది బయటకు వెళ్లి చిరుత బయటకు రాకుండా తలుపు వేశాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు