Harish Rao: వరికి బోనస్‌ ఇవ్వకుండా ఎలా ఓట్లు అడుగుతారు?: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.

Updated : 06 Mar 2024 17:01 IST

హైదరాబాద్‌: తమ ఎంపీలను భాజపా లాగేసుకుంటోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో ఏముంది?అని ప్రశ్నించారు. ‘‘100 రోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. వైట్‌ పేపర్‌, బ్లాక్‌ పేపర్‌ అంటూ మోదీకి లవ్‌ లెటర్‌ తప్పితే మీ పాలనలో ఏముంది? రేవంత్‌ రెడ్డి ప్రజలనే కాదు.. కాంగ్రెస్‌ పార్టీనీ మోసం చేస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలవదని చెప్పకనే చెప్పారు. గుజరాత్‌ మోడల్‌ నిరంకుశమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. రేవంత్‌ మాత్రం గుజరాత్‌ మోడలే కావాలంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్‌ మాట తప్పారు. వరికి బోనస్‌ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారు?’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని