Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 Apr 2024 20:59 IST

1. సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. నంద్యాల జిల్లా డోన్‌లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టిన సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జూదం క్లబ్బులు కావాలా...? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా?: పవన్‌

వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా.. జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్‌రెడ్డి

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. భాజపాపై పోరాడే వారికి అమిత్‌షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు దిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోక్‌సభ ఎన్నికల్లో ‘ఏకగ్రీవం’.. ఇప్పటివరకూ ఎంతమందంటే..?

పోలింగ్‌ జరగకుండానే భాజపా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1951 నుంచి ఇప్పటివరకు 35 మంది అభ్యర్థులు లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టెక్‌ హబ్‌ను ట్యాంకర్‌ హబ్‌గా మార్చారు - కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపిస్తూనే అలా జరగనివ్వనని ఉద్ఘాటించారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. టెక్‌ హబ్‌గా ఉన్న బెంగళూరును ట్యాంకర్‌ హబ్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. బాలిక ప్రయోజనాలే పరమావధిగా పేర్కొన్న సీజేఐ.. ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాఠ్య పుస్తకాల అప్‌డేషన్‌పై NCERTకి కేంద్రం కీలక సూచన!

దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT)కు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏటా పాఠ్య పుస్తకాలను సమీక్షించి, అప్‌డేట్‌ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్‌డేట్‌ చేసే పద్ధతి ఏమీ లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్‌ వైరల్‌

‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ)(AI) టెక్నాలజీతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కి చెందిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు అందులో వినిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో గతేడాది 33% మందికి దక్కని కొలువులు

ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. సాధారణంగా ఐఐటీల్లో చదివిన వారికి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగం, రూ.లక్షల్లో ప్యాకేజీ వంటివే వింటూ ఉంటాం. అందుకు భిన్నంగా గతేడాది (2022-23) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న విద్యార్థుల్లో 33 శాతం మందికి కొలువులు రాకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇజ్రాయెల్‌ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!

గాజాపై విరుచుకుపడుతోన్న వేళ.. ఇజ్రాయెల్‌ (Israel)కు ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC)’ గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని