TSPSC: మరో 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి

పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

Updated : 07 Jun 2022 15:20 IST

హైదరాబాద్‌: పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 657 ఏఈఈ, 113 ఏఈ, హెల్త్‌ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ.. తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.  కాగా ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. 

80,039 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో గ్రూప్-1 పోస్టులు సహా పోలీసు, రవాణా, అటవీ, ఎక్సైజ్, వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, పోలీసు నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తైంది. తాజాగా ఉత్తర్వులిచ్చిన 1433 ఖాళీలు కలుపుకొని.. ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లు అయ్యింది. వైద్య, ఆరోగ్యశాఖలోని  12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో తొలి విడతగా 1,326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మిగిలిన ఆయా శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థికశాఖ కరసత్తు చేస్తోంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని