Ts News: భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసు... హైకోర్టుకు మధ్యంతర నివేదిక

ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు మధ్యంతర నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. సాయిగణేశ్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ

Published : 07 Jun 2022 17:31 IST

హైదరాబాద్‌: ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు మధ్యంతర నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. సాయిగణేశ్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ న్యాయవాది కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు సమర్పించిన నివేదికను పిటిషనర్‌కు ఇవ్వాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. గణేశ్‌ అమ్మమ్మ దాఖలు చేసిన మరో పిటిషన్‌తో కలిపి పిల్‌ విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. గణేశ్‌ ఆత్మహత్యపై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదే కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌ సహా పలువురికి గతంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

భాజపా మజ్దూర్‌ యూనియన్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్న గణేశ్‌ ఈ నెల 14న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని