PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!

పీసీఓడీతో అమ్మాయిలు చాలా మంది బాగా బరువు పెరుగుతారు. నెలసరి నుంచి మొదలు సంతానం దాకా దీని ప్రభావం ఉంటుంది.

Published : 27 Jun 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీసీఓడీ(PCOD)తో అమ్మాయిలు చాలా మంది బాగా బరువు పెరుగుతారు. నెలసరి నుంచి మొదలు సంతానం దాకా దీని ప్రభావం ఉంటుంది. ఎన్నో సమస్యలను తీసుకొచ్చే ఈ పీసీఓడీ ఇప్పుడు అధిక బరువును కూడా తెస్తోంది. ఇన్సులిన్‌ నిరోధకతను తెచ్చి పెడుతోంది. ఆహార నియమాలను పాటించుకుంటూ ఆయుర్వేద ఔషధాలు తీసుకుంటే ఈ సమస్యను అధిక మించడానికి వీలుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్య తొలగించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను ఆయుర్వేద ఫిజిషియన్‌ పెద్ది రమాదేవి తెలిపారు.

వచ్చే ఇబ్బందులెన్నో: అమ్మాయిలకు రుతుస్రావం నుంచి మొదలుకొని గర్భం దాల్చేదాకా ఎన్నో సమస్యలు పీసీఓడీతో వస్తాయి. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో అండాశయంలో పుట్టుకొచ్చిన చిన్న చిన్న నీటి బుడగలు నెలసరిని గాడి తప్పేలా చేస్తాయి. నెలసరి రాకపోవడం లాంటి సమస్యలతో మొహం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. ఒంట్లో ఇన్సులిన్‌ నిరోధకత కూడా పెరుగుతుంది. 

పరిష్కార మార్గాలివి

* ఆహార నియమాలను పాటించాలి. పిండి పదార్థాలను తీసుకోవద్దు. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. మాంసకృతులను అధికంగా తీసుకోవాలి.

* అధికంగా మాంసాహారం తినొద్దు. మితంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. గుడ్డు, చేపలు తినొచ్చు. 

* ఆహార నియమాలు పాటించడంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక బరువును నియంత్రించడానికి వీలవుతుంది.

* అధిక బరువుతోనే పీసీఓడీ ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

* తాజా పండ్లు, ఆకు, కాయకూరలను తీసుకోవడంతో ఆరోగ్యం బాగుంటుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

* నాగకేసరాల చూర్ణం, పుష్యానుగ్‌ చూర్ణం తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే పీసీఓడీను నివారించవచ్చు.

* అల్లం రసం తేనెగానీ బెల్లంతోగానీ తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. 

* ఉసిరికాయ చూర్ణం పసుపు కలిపిన మిశ్రమాన్ని రోజుకు అరగ్రాము చొప్పున తీసుకుంటే బరువు తగ్గడానికి వీలుంది.

* కరక్కాయ చూర్ణం రోజుకు అర చెంచాను నీటితో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే అధిక బరువు, పీసీఓడీకి పరిష్కారం లభిస్తుంది.

* ఆయుర్వేదంలో చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. కొంతమందికి 3 నెలలు. కొంతమందికి 6 నెలలు మందులు వాడితే ఇబ్బందులు తొలగిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని