హెల్మెట్‌ మాకేనా.. మీరెందుకు పెట్టుకోరు?

హెల్మెట్‌ పెట్టుకోలేదని పోలీసులనే ప్రశ్నించాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు చలానాలు విధిస్తుండగా.. వారికే  హెల్మెట్‌ లేని విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని వాటిని ప్రశ్నించాడు....

Published : 20 Mar 2021 13:01 IST

ఇల్లందు: హెల్మెట్‌ పెట్టుకోలేదని పోలీసులనే ప్రశ్నించాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పోలీసులు ద్విచక్రవాహనాలపై హెల్మెట్‌ ధరించకుండా వచ్చిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నించాడు. మీకు శిరస్త్రాణం పెట్టుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఎందుకు హెల్మెట్‌ పెట్టుకోలేదని, మీరే నిబంధనలు పాటించనప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారని మండిపడ్డాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని