health:అతి చురుకైన పిల్లలకు యోగా

కొంతమంది పిల్లలు అతి చురుకుగా ఉంటారు. ఏదైనా చేయగలమనే ధీమా కన్పిస్తుంది. శక్తికి మించిన పనులు చేసిసమస్యలు కొని తెచ్చుకుంటారు.

Published : 28 Feb 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమంది పిల్లలు ఆటలు, పాటలు, చదువు,అల్లరిలో చురుకుగా ఉంటారు. కొంతమంది పిల్లలు అతి చురుకుగా ఉంటారు. ఏదైనా చేయగలమనే ధీమా కన్పిస్తుంది. శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటారు. దీన్ని వైద్యులు ఏడీహెచ్‌డీ ప్రవర్తనగా గుర్తించారు. వీరికి యోగా చక్కని పరిష్కారమని పేర్కొంటున్నారు. పిల్లల్లో అతి చురుకుదనం తగ్గించి కుదురుగా ఉండేలా చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.

అతి ప్రవర్తనకు అడ్డుకట్ట

కొంతమంది పిల్లల్లో ఉండే అతి చురుకుదనాన్ని ఏడీహెచ్‌డీ(అటెన్షన్‌ డిఫిసెన్సీ హైపర్‌యాక్టీవ్‌ డిజార్డర్‌) అంటారు.  ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులే కాదు ఇతరులు కూడా ఇబ్బంది పడుతారు. ఇది మానసిక వ్యాధి కాదు. యోగాతో ఈ సమస్యను అధిగమించవచ్చు. పర్వతాసనం, శశంకాసనం, నాడీశుద్ధి చేస్తే ఫలితాలు బాగుంటాయి. వారం పది రోజుల్లో మార్పు కనిపిస్తుంది. మనస్సును నిగ్రహంగా ఉంచడంలో యోగాది అద్భత పాత్ర అని యోగా నిపుణులు ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని