YS Bhaskarreddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు.

Published : 01 Dec 2023 18:16 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్‌ బెయిల్‌ గడువు ముగిసింది.  అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.  దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని