హిందూ సముద్రంలో 120 యుద్ధనౌకలు

చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. వివిధ మిషన్‌లకు మద్దతుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో 120 యుద్ధ నౌకలను మోహరించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ భద్రతా సదస్సులో ప్రసంగించిన రావత్‌.. శాంతి, సార్వభౌమత్వాన్ని

Published : 11 Dec 2020 23:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. వివిధ మిషన్‌లకు మద్దతుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో 120 యుద్ధ నౌకలను మోహరించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ భద్రతా సదస్సులో ప్రసంగించిన రావత్‌.. శాంతి, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే సముద్రతీరాల్లోని సమాచార వ్యవస్థ సురక్షితంగా ఉండటం కీలకమన్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతం శాంతియుతంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుకునేందుకు చైనాలో ఆర్థిక, సైనిక రంగాలు పోటీపడి వృద్ధిచెందాయని గుర్తుచేశారు. సైనిక రంగంలో సాంకేతికత దాన్ని నాశనం చేసేలా ఉండరాదని సూచించారు. భాగస్వామ్య దేశాలతో శిక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్తులో మరింత బలపడేందుకు భద్రత అంశాలను ఏకపక్షం నుంచి బహుపక్షాలకు మార్చాలని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని