Viral video: థార్‌లో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు యత్నం.. వీడియో వైరల్!

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు కొందరు యువకులు మహీంద్రా థార్‌ (Mahindra Thar) వాహనాన్ని వినియోగించారు. అది మధ్యలో మొరాయించడంతో చిక్కుకుపోయారు. 

Published : 04 Oct 2023 01:52 IST

Image: GreaterNoidaW

దేహ్రాదూన్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రంలో పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్మోరాలోని రామ్‌గంగా నదిని కొందరు తమ థార్‌ (Mahindra Thar) వాహనంలో ప్రయాణిస్తూ దాటేందుకు ప్రయత్నించారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతానికి ముగ్గురు యువకులు ఉత్తరాఖండ్‌ వెళ్లారు. మహీంద్రా థార్‌ వాహనంలో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం అత్యధికంగా ఉంది. దాంతో వారి వాహనం మధ్యలోనే నిలిచిపోయింది. వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ యువకులు వాహనంపైకి ఎక్కారు. 

నాందేడ్ ఆస్పత్రి డీన్‌తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!

వైరలైన వీడియోలో ముగ్గురు యువకుల్లో ఒకరు లైఫ్‌ జాకెట్‌ ధరించారు. ఒడ్డున కొంత మంది నిల్చొని వీరిని గమనిస్తున్నారు. కొందరు కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా కలిసే విహారయాత్రకు వచ్చారా అనే విషయంపై స్పష్టత లేదు. లైఫ్‌ జాకెట్ వేసుకున్న యువకుడు తొలుత నదిలోకి దూకగా.. ప్రవాహ ఉద్ధృతికి కొంత దూరం కొట్టుకుపోయాడు. వెంటనే ఒడ్డునున్న వారు అతణ్ని రక్షించారు. మిగతా ఇద్దరు సైతం కాసేపటి తర్వాత నదిలో నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని