మాపై హిందీని ప్రయోగించకండి: కనిమొళి

తమిళనాడులో రైల్వే ప్రయాణికులకు హిందీలో సంక్షిప్త సందేశాలు రావడంపై వివాదం రాజుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు, ఎన్డీయే కూటమి పార్టీ అయిన పీఎంకే వ్యవస్థాపకులు

Published : 05 Oct 2020 00:16 IST

చెన్నై: తమిళనాడులో రైల్వే ప్రయాణికులకు హిందీలో సంక్షిప్త సందేశాలు రావడంపై వివాదం రాజుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు, ఎన్డీయే కూటమి పార్టీ అయిన పీఎంకే వ్యవస్థాపకులు రామ్‌దాస్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీయేతరులపై ఆ భాషను బలవంతంగా ప్రయోగించవద్దని ప్రభుత్వంపై వారు విమర్శలు చేశారు. దీనిపై దక్షిణ విభాగం రైల్వే అధికారులు స్పందిస్తూ ఈ విషయం తమ పరిధిలోకి రాదంటూ.. ఐఆర్‌సీటీసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. 

ముందుగా డీఎంకే ఎంపీ తమిళాచి తంగపాడియన్‌ తనకు హిందీ భాషలో వచ్చిన రైల్వే సమాచారాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘హిందీ భాషను మాపై ప్రయోగించమని కేంద్రం హామీ ఇస్తూనే మళ్లీ ఆ పద్ధతిని ఈ విధంగా కొనసాగిస్తోంది. దీన్ని ఆపాలి’ అంటూ ఆమె రైల్వే మంత్రిత్వ శాఖకు ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం స్పందిస్తూ.. ప్రభుత్వం ప్రజల మనోభావాల్ని గౌరవించడం లేదని.. పదేపదే హిందీని తమపై ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీ అయిన పీఎంకే వ్యవస్థాపకులు రామ్‌దాస్‌ సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హిందీ భాషలో సందేశాలు పంపించడాన్ని రైల్వే శాఖ ఆపేయాలన్నారు. ఇలాంటి ప్రకటనలు ఏవైనా తమిళ భాషలోనే పంపేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని