పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీ జీ: మోదీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శనివారం తన 70వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 12 Dec 2020 12:01 IST

దిల్లీ: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శనివారం తన 70వ పుట్టినరోజు జరుపుకొంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని శనివారం ఉదయం ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టారు. మరోవైపు తన పొలిటికల్‌ ఎంట్రీపై సుదీర్ఘ కాలంగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ పార్టీ ప్రారంభించనున్నట్లు రజనీ ఈ నెల 3న ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ ఏర్పాటు తేదీ, తదితర వివరాలను ఈ నెల 31న ప్రజలకు వెల్లడిస్తామన్నారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ రాజకీయ ప్రవేశం కీలకంగా మారింది.
శరద్‌పవార్‌కూ శుభాకాంక్షలు..

శనివారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 81వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి..

బర్త్‌డే స్పెషల్‌: రజనీ ఐదు రూపాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని