Booster Dose: రష్యాలో ప్రారంభం

రష్యాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ‘బూస్టర్‌ డోస్‌’ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆరు నెలల క్రితం కొవిడ్‌ సోకి కోలుకున్న వారికి, ఆరు నెలల కిందట తొలి డోసు వేసుకున్నవారికి ఈ

Updated : 02 Jul 2021 09:04 IST

మాస్కో: రష్యాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ‘బూస్టర్‌ డోస్‌’ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆరు నెలల క్రితం కొవిడ్‌ సోకి కోలుకున్న వారికి, ఆరు నెలల కిందట తొలి డోసు వేసుకున్నవారికి ఈ బూస్టర్‌ డోస్‌ ఇస్తోంది. దేశీయంగా తయారు చేసిన స్పుత్నిక్‌-వి టీకానయితే రెండు డోసులుగా, స్పుత్నిక్‌ లైట్‌ను అయితే ఒకే డోసు కింద ఇస్తోంది. దేశ జనాభా 14.6 కోట్లు కాగా, అందులో 2.3 కోట్ల మందికే ఇంతవరకు ఏదో ఒక డోసు టీకా లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని