‘ఈ భూగ్రహం సురక్షితంగా ఉండాలని కోరుకుందాం’

దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 17 Oct 2020 11:06 IST

ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

దిల్లీ: దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పండగరోజులు ప్రజలకు శాంతి, సంపదలను తీసుకురావాలని కోరుకున్నారు. ‘నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి మాతకు ప్రణామాలు. ఆమె ఆశీస్సులతో ఈ భూగ్రహం సురక్షితంగా, ఆరోగ్యంగా, సంపదలతో అలరారుతుందని ఆశిద్దాం. ఆమె ఆశీర్వాదం పేద, అణగారిన ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మాకు బలాన్ని ఇస్తుంది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో జగదాంబా అమ్మవారిని స్మరించుకున్నారు.  

కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య నిపుణులు, అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని