
కరోనా: అది చైనా ప్లేగు!
మరోసారి విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్
చైనా వల్లే ప్రపంచమంతా సోకిందని విమర్శ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యవహారంలో చైనా తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి కరోనావైరస్‌ను 'చైనా నుంచి వచ్చిన ప్లేగు'గా అభివర్ణించారు. ఎప్పటికీ సంభవించకూడదనుకున్న దాన్ని చైనా పునరావృతం చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇలా జరగడానికి చైనానే కారణమని మరోసారి ఆరోపించారు. సరికొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి, ఆ సిరా ఆరకముందే ఈ మహమ్మారి బయటపడిందన్నారు. వైట్‌హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ విధంగా స్పందించారు. తాజాగా జులై మాసాన్ని 'అమెరికా కార్మికుల నెలగా వాగ్దానం' చేసిన ప్రకటనపై ట్రంప్ సంతకం చేశారు.
మరోవైపు అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరిన్ని రాష్ట్రాల్లో వికృత రూపం చూపిస్తోంది. రానున్న రోజుల్లో నిత్యం దాదాపు లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 28లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో లక్షా 30వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి..
భారత్‌లో కరోనా: 24గంటల్లో 21వేల కేసులు
ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.