రెండోసారి కరోనా..ఆందోళనకరమే!
రెండోసారి కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముంబయి: రెండోసారి కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నలుగురు వ్యక్తుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అధ్యయనం చేసిన మీదట వారు ఈ నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ప్రిప్రింట్ వెల్లడించిన వివరాలు ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
బీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోన్న నాయర్ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యులు, హిందుజా ఆసుపత్రికి చెందిన ఒక ఆరోగ్య కార్యకర్తకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. ఈ రెండు ఆసుపత్రులతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, దిల్లీకి చెందిన ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్స్ ఇంజనీరింగ్ అండ్ బయోలజీ వారి జీనోమ్స్‌పై అధ్యయనం నిర్వహించాయి. నలుగురు నుంచి రెండు సార్లుగా ఎనిమిది నమూనాలను తీసుకొని పరిశీలించగా..వారి వైరస్ జీనోమ్స్‌లో 39 సార్లు ఉత్పరివర్తనలు చోటుచేసుకున్నట్లు గమనించారు.
‘వారిలో రెండో సారి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. మొదటి సారితో పోల్చుకుంటే ఎక్కువ రోజులు అనారోగ్యంతో ఉన్నారు. కొవిడ్‌పై ముందుండి పోరాటం చేస్తోన్న వైద్యసిబ్బంది మరోసారి వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష రీఇన్ఫెక్షన్ను నిర్ధారించదు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ విషయం వెల్లడవుతుంది’ అని పరిశోధకులు వెల్లడించారు. మొదటి సారి లక్షణాలు లేని, స్వల్ప స్థాయిలో ఉన్నవారు రెండోసారి మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వయసు తక్కువ కావడంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి ఉండకపోవచ్చని అభిప్రాయడ్డారు. సుమారు నెల రోజుల క్రితం తొలి రీఇన్ఫెక్షన్ కేసు హాంకాంగ్‌లో వెలుగుచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్‌కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్
లోక్‌సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్‌సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్‌పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్‌లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్