దిల్లీ మహిళా కమిషన్‌లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు

దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు.

Published : 03 May 2024 05:28 IST

దిల్లీ: దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. జూన్‌, 2017లో ఓ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ‘తొలగింపు’ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ 223 మంది ఒప్పంద ఉద్యోగులను తొలగించినట్లు గత నెల 29న ఆదేశాలు వెలువడ్డాయి. అయితే 52 మందిని మాత్రమే తొలగించినట్లు గురువారం స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా కమిషన్‌లో మొత్తం 223 పోస్టులను అక్రమంగా సృష్టించారని, అయితే 52 మందిని మాత్రమే నియమించారని ఓ అధికారి చెప్పారు. నివేదిక ఆధారంగా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వి.కె.సక్సేనాకు తొలగింపు ప్రతిపాదనలు పంపిందని, ఎల్జీ నుంచి ఆమోదం లభించడంతో ఆ దేశాలు జారీ అయ్యాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని