మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే

మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది.

Published : 03 May 2024 05:37 IST

మతస్వేచ్ఛపై అమెరికా సంస్థ నివేదికను తప్పుబట్టిన భారత్‌

దిల్లీ: మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఇచ్చిన నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని స్పష్టంచేసింది. ‘ఇది మా దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే. మా దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రచారమే. మరో రూపంలో చేసే దుష్ప్రచారానికి ఈ నివేదిక ఒక తార్కాణం’ అని భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అనేది పక్షపాతంతో వ్యవహరించే సంస్థ. రాజకీయ ఎజెండాతోనే అది పని చేస్తుంది. భారత్‌లోని విభిన్న, బహుళార్థ, ప్రజాస్వామ్య విలువలు ఆ సంస్థకు అర్థం కావు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియలో ఇలా అమెరికా సంస్థ జోక్యం చేసుకోవడం ఎన్నటికీ విజయం సాధించదు’ అని జైశ్వాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని