వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర గ్రీన్‌ నెట్స్‌

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి.

Published : 03 May 2024 05:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. అయినా కొందరు నిత్యం కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అలాంటి వారి కోసం పుదుచ్చేరి సర్కారు వినూత్న ఆలోచన చేసింది. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్‌ నెట్స్‌ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్‌ షేడ్‌ నెట్‌ను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని