Covid Vaccine: వచ్చే నెలాఖరుకు చిన్నారుల కొవిడ్‌ టీకా

అమెరికాలో డెల్టా రకం కరోనా వైరస్‌ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది.

Published : 14 Sep 2021 23:35 IST

 5-11 ఏళ్ల వారి కోసం సిద్ధంచేస్తున్న ఫైజర్‌

న్యూయార్క్‌: అమెరికాలో డెల్టా రకం కరోనా వైరస్‌ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. దీంతో 12 ఏళ్లలోపు వారికి వీలైనంత త్వరగా టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఔషధ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. 5-11 ఏళ్ల వయసు పిల్లల కోసం అక్టోబరు చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని అక్కడి ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్లినికల్‌ పరీక్షలు వేగంగా జరుగుతున్నట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుతం 12 ఏళ్ల వయసు దాటినవారికి మాత్రమే టీకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లల కోసం ఫైజర్‌ సంస్థ వ్యాక్సిన్‌ను తయారుచేసి, క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించాల్సి ఉందని ఆ సంస్థ వ్యాక్సిన్‌ బోర్డు సభ్యుడు స్కాట్‌ గాట్లీబ్‌ తెలిపారు.

బ్రిటన్‌లో 12-15 ఏళ్ల వారికి ఇవ్వాలని నిర్ణయం

లండన్‌: చిన్నారులకు వీలైనంత త్వరగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలని బ్రిటన్‌కు చెందిన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌ (సీఎంవోలు) నిర్ణయించారు. ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ తయారుచేసిన టీకాను... 12-15 ఏళ్ల వయసువారికి సింగిల్‌ డోసుగా అందించాలని వారు ప్రభుత్వానికి సూచించినట్టు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు