Air India: ఆకాశంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

లండన్‌ నుంచి కోచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ వేదన మొదలుకావడమే

Updated : 07 Oct 2021 11:25 IST

దిల్లీ: లండన్‌ నుంచి కోచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ వేదన మొదలుకావడమే ఇందుక్కారణం. విమానంలో 204 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారు. వీరు వెంటనే ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవం సుఖాంతమై.. క్యార్‌ క్యార్‌ అనే బాబు కేకలతో ‘హమ్మయ్య’ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని దించి, తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. మరో ప్యాసింజరు వీరికి తోడుగా ఉన్నారు. మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కోచికి బయలుదేరింది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురినీ తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని