Flight: అంతర్జాతీయ విమానంలో ఏపీ మహిళకు లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

విమానంలో (Flight) తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 08 Nov 2023 17:27 IST

బెంగళూరు: విమాన (Flights) ప్రయాణాల సందర్భంలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ (32)కు అలాంటి భయంకరమైన వేధింపులే ఎదురయ్యాయి. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌- బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్‌ 6న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. మహిళ విమానంలో నిద్రపోతుండగా ఆమె పక్కనే కూర్చున్న తోటి ప్రయాణికుడు ఆమె ప్రైవేటు భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు.  ఆ  తర్వాత ప్రయాణ సమయంలోనూ ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగించడంతో  ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి చెప్పి సదరు మహిళ తన సీటును మార్చుకున్నారు. 

బోగీలో మృతదేహంతో.. 600 కి.మీ రైలు ప్రయాణం..!

అనంతరం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అక్కడి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తాను నిద్రపోతున్న సమయంలో నిందితుడు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354 ఎ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని.. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని