Train: బోగీలో మృతదేహంతో.. 600 కి.మీ రైలు ప్రయాణం..!

సొంతూరుకు రైలులో బయద్దేరిన ఓ వ్యక్తి.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తోటి ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని తెలుస్తోంది. 

Published : 08 Nov 2023 15:31 IST

(ప్రతీకాత్మక చిత్రం)

చెన్నై: తమిళనాడు సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌(Tamil Nadu Sampark Kranti Express)లో ప్రయాణికులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. 600 కి.మీ పాటు మృతదేహంతో రైలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బాందా జిల్లాకు చెందిన 36 ఏళ్ల  రామ్‌జీత్ యాదవ్.. చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. అతడు తన బంధువుతో కలిసి చెన్నై నుంచి తన సొంత జిల్లాకు బయల్దేరారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం సరిగాలేదు. రైలు నాగ్‌పుర్ సమీపంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా రామ్‌జీత్‌ ఆరోగ్యం క్షీణించి, మృతి చెందాడని అతడి బంధువు వెల్లడించారు. అతడిని రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని చెప్పారు.

విమానంపై నుంచి పడి ఇంజినీర్‌ మృతి.. మరమ్మతు చేస్తుండగా ఘటన!

ఈ మృతిపై భోపాల్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చినా.. ఆ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాటు చేయలేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో దాదాపు 600 కి.మీ మేర వారు మృతదేహంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఎదురైంది. రైలు యూపీలోని ఝాన్సీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించారు. ఆదివారం రామ్‌జీత్ మృతి చెందగా.. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు