Ukraine: అనవసర ప్రయాణాలొద్దు.. ఉక్రెయిన్‌లో భారతీయులకు హెచ్చరిక

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై మళ్లీ రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక హెచ్చరికలు చేసింది.

Published : 11 Oct 2022 01:17 IST

దిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై మళ్లీ రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది. ఉక్రెయిన్‌లో భారతీయులు తమ పరిస్థితిని రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది.

రష్యా- క్రిమియాలను అనుసంధానం చేసే కెర్చ్‌ రోడ్డు, రైలు వంతెనపై ఇటీవల భారీ పేలుడు సంభవించింది. క్రిమియాకి జీవనాడిగా ఉన్న ఈ వంతెన పేల్చివేయడంపై రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే, దీని వెనుక ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం హస్తం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించిన మరుసటి రోజే క్రెమ్లిన్‌ సేనలు కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులతో దాడికి దిగాయి. ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు రోడ్లు, భవనాలు, వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీవ్‌లోని భారత ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని