Air India: 18 వరకు టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులు బంద్‌: ఎయిరిండియా

ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతల వేళ.. టెల్‌ అవీవ్‌కు మరికొన్ని రోజులు విమాన సర్వీసులను ఎయిరిండియా (Air India) నిలిపివేసింది. విమానాల రద్దును అక్టోబరు 18 వరకు పొడిగించింది.

Published : 14 Oct 2023 15:14 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌ - హమాస్‌ (Israel - Hamas Conflict) మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా (Air India) తాత్కాలికంగా నిలిపివేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ విమానాల రద్దును మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా దిల్లీ - టెల్‌ అవీవ్‌ (Delhi - Tel Aviv) మధ్య రాకపోకలు సాగించే విమానాలను అక్టోబరు 18 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా అధికారి శనివారం వెల్లడించారు.

అయితే, అవసరాన్ని బట్టి ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఛార్టెర్డ్‌ విమానాలను నడుపుతుందని ఆ అధికారి తెలిపారు. సాధారణంగా దిల్లీ - టెల్‌ అవీవ్‌ మధ్య సోమ, మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఎయిరిండియా విమానాలు నడుపుతోంది. అయితే ఉద్రిక్తతల దృష్ట్యా అక్టోబరు 7 నుంచి ఈ సర్వీసులను నిలిపివేశారు.

బందీల పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు.. వీడియో వైరల్‌

మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ అజయ్‌’ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు ప్రత్యేక విమానాల్లో దాదాపు 450 మంది భారతీయులు దిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారిలో దాదాపు 14వేల మంది కేర్‌టేకర్లే. వీరితోపాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని