Israel-Hamas: బందీల పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు.. వీడియో వైరల్‌

Israel-Hamas: హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న పిల్లలను మిలిటెంట్లు ఆడిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 14 Oct 2023 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఇజ్రాయెల్‌ (Israel)పై దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్లు.. అక్కడ్నుంచి కొంతమంది పౌరులను బందీలుగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ బందీలకు సంబంధించిన ఓ వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అవుతోంది. అందులో హమాస్‌ (Hamas) మిలిటెంట్లు బందీల పిల్లలను ఆడిస్తూ, వారితో ఆడుకుంటూ కన్పించారు.

ఓ మిలిటెంట్‌ ఒక చేతిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని మరో చేత్తో చంటిబిడ్డను ఎత్తుకుని ఆడించారు. ఓ పిల్లాడ్ని ఉయ్యాలో వేసి ఊపుతూ కన్పించారు. ఈ వీడియోను హమాస్‌ తొలుత తమ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పోస్ట్ చేయగా.. హమాస్‌ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ మిలిటెంట్లు అనేక అకృత్యాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. ఈ వీడియో రావడం చర్చనీయాంశంగా మారింది. తమపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్నిచ్చేందుకే హమాస్‌ ఈ వీడియోను విడుదల చేసినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

యుద్ధ నియమాలు పాటిస్తున్నారా?

అయితే, ఇదే వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘హమాస్‌ చెరలో బందీ అయిన ఈ పిల్లలకు గాయాలయ్యాయి. వారు ఏడుస్తున్నారు. భయపడుతున్నారు. ఈ ఉగ్రవాదులనే మేం ఓడించబోతున్నాం’’ అని రాసుకొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని