Delhi: దిల్లీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం మాత్రమే..

దేశ రాజధాని నగరం దిల్లీ కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. తాజాగా ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Published : 11 Jan 2022 13:52 IST

ప్రైవేటు కార్యాలయాల మూసివేతకు ఆదేశాలు.. 

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ మేరకు దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు అన్ని ప్రైవేటు కార్యాలయాలు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతులున్నాయి. తాజాగా దిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించింది. వాటికింద అత్యవసర సేవలు లేక మినహాయింపు విభాగం కిందకు వచ్చే కొన్ని కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. మిగిలిన ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని పేర్కొంది. అలాగే రెస్టారెంట్లను మూసివేయాలని నిన్న దిల్లీ ఆదేశాలు ఇచ్చింది. టేక్‌అవే, హోం డెలివరీలకు మాత్రం అనుమతి ఉందని చెప్పింది.

అక్కడ తాజాగా 19 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. 17 మరణాలు సంభవించాయి. మరోపక్క ఈ వారంలో దిల్లీలో కరోనా వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అంచనా వేశారు. ఆ తర్వాత నుంచి కేసుల తగ్గుదల ప్రారంభం అవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని