Anand Mahindra: మీకు చెప్పానో.. నా ఉద్యోగం ఊడుతుంది..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో చురుగ్గా ఉంటారు. కొన్నిసార్లు స్ఫూర్తి నింపే మాటలు చెప్తారు.

Published : 07 May 2022 01:30 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో చురుగ్గా ఉంటారు. కొన్నిసార్లు స్ఫూర్తి నింపే మాటలు చెబుతారు. మరికొన్ని సార్లు చమత్కారాలు విసురుతారు. అప్పుడప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. తాజాగా తనకు ఎదురైన ప్రశ్నకు ఆయన తెలివిగా ఇచ్చిన సమాధానం నెటిజన్లను మెప్పిస్తోంది. 

మహీంద్రా సంస్థ నుంచి సరికొత్త స్కార్పియో లాంచ్‌ గురించి ఓ నెటిజన్‌ ఆనంద్‌ను ప్రశ్నించారు. దాని గురించి వెయిట్‌ చేస్తున్నామని, లాంచ్‌ డేట్ చెప్పండని అడిగారు. ‘ష్‌.. నేను మీకు చెప్తే, నా ఉద్యోగం ఊడుతుంది. నేను కూడా మీలాగే కొత్త మోడల్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ చమత్కరించారు. కాగా, మహీంద్రా భలే తప్పించుకున్నారే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘నేను చూసిన వాటిలో అత్యంత సరదా ట్వీట్ ఇది’, ‘మీరే యజమాని. మిమ్మల్ని ఎవరు ఫైర్ చేస్తారులేండి’ అంటూ ట్వీట్లు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు