Anand Mahindra: దొంగతనం జరిగిందంటూ ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌.. ముంబయి పోలీసుల అదిరిపోయే రిప్లయ్‌!

Anand Mahindra: సమాజంలో జరిగే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, స్ఫూర్తివంతమైన కథనాలు పంచుకొనే ఆనంద్‌ మహీంద్రా తాజాగా దొంగతనం జరిగిందంటూ పోస్ట్‌ చేశారు.

Updated : 16 Sep 2023 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకొనే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తాజాగా దొంగతనం జరిగిదంటూ పోస్ట్‌ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. మహీంద్రా పోస్ట్‌కు అదిరిపోయే రిప్లయ్‌ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (BEST)కి చెందిన రెడ్‌ కలర్‌ డబుల్ డెక్కర్‌ డీజిల్‌ బస్సులకు ముంబయి ప్రభుత్వం శుక్రవారం వీడ్కోలు పలికింది. ఇకపై రహదారులపై కనిపించబోవని తెలిపింది. అయితే దీనిపై ఆనంద్‌ మహీంద్రా భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు.‘హలో, ముంబయి పోలీస్‌? నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదాన్ని దొంగతనం చేశారు. నేను దానిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నా’ అంటూ మహీంద్రా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. అయితే దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. ‘మేము మీ  గత స్మృతులకు సంబంధించిన ఫిర్యాదు అందుకున్నాం. అలాగే ఆ దొంగతాన్ని స్పష్టంగా చూస్తున్నాం. కానీ, మేం దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేం. బృహన్‌ ముంబయి చెందిన ఈ బస్సు జ్ఞాపకాలు మీ హృదయంలోనే కాదు.. ముంబయి ప్రజలందరి మదిలో పదిలంగా నిలిచాయి’ అంటూ బదులిచ్చారు. ముంబయి పోలీసుల చేసిన ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు.

‘ప్రత్యేకం’ ముగిసిన మరునాడే.. ‘జమిలి’ కమిటీ తొలి భేటీ

దాదాపు 86 సంవత్సరాల క్రితమే డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్‌ బస్సులను ముంబయి ప్రభుత్వం తీసుకొచ్చింది. శుక్రవారం (సెప్టెంబరు 15)తో ఆ బస్సులకు వీడ్కోలు పలికింది. చివరి సారిగా ఆ బస్సు రోడ్లపై చక్కర్లు కొట్టనున్న సందర్భంగా  పూల దండలు, బెలూన్లతో దాన్ని అందంగా అలంకరించారు. రోజంతా ముంబయి నగర వీధుల్లో చక్కర్లు కొట్టించారు. దీంతో చివరి సారిగా తమ గత జ్ఞాపకాలను పదిలంగా దాచుకొనేందుకు ముంబయి వాసులు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని