Malnutrition: దేశంలో 7 శాతం చిన్నారుల్లో పోషకాహార లోపం..!

దేశంలో ఏడు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 06 Apr 2022 20:54 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

దిల్లీ: దేశంలో ఏడు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో రెండు శాతం మంది చిన్నారులు మాత్రమే అత్యంత తీవ్రమైన పోషకాహార లోపాన్ని (SAM) ఎదుర్కొంటున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా చిన్నారుల పోషకాహారంపై ‘పోషణ్‌’ ట్రాకర్‌ పద్ధతిలో సేకరించిన వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో వెల్లడించారు. అయితే, దేశంలో 19శాతం చిన్నారులు పోషకాహార లోపంతో ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)గణాంకాల కంటే ప్రస్తుతం నివేదికలో తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అనుసరించి పోషణ్‌ ట్రాకర్‌ పద్ధతిలో అంగన్‌వాడీల పనితీరుపై అంచనాలు రూపొందించాం. వీటిలో కేవలం రెండు శాతం చిన్నారులు మాత్రమే తీవ్ర పోషకాహార సమస్య (SAM)తో బాధపడుతున్నట్లు తేలింది. మరో ఐదు శాతం మంది పిల్లలు సాధారణ పోషకాహారంతో (MAM) బాధపడుతున్నారు’ అని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ రెండూ కలిపి మొత్తంగా 7శాతం మంది పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని