Arvind Kejriwal: మనీశ్‌ కోసం మనమంతా ప్రతిజ్ఞ చేయాలి.. బర్త్‌డే రోజు కేజ్రీవాల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన పుట్టినరోజు సందర్భంగా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. అలానే, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను మిస్‌ అవుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

Published : 16 Aug 2023 13:01 IST

దిల్లీ: పుట్టినరోజునాడు తనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) లేకపోవడం ఎంతో బాధాకరమని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. బుధవారం కేజ్రీవాల్‌ పుట్టినరోజు సందర్బంగా ప్రధాని మోదీ (PM Modi) సహా పలువురు నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. మనీశ్‌కు సంతోషం కలిగించే విధంగా మనమంతా భారత దేశంలోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలని సోషల్‌ మీడియా పోస్టులో కోరారు.

‘‘ఇవాళ నా పుట్టిన రోజు. నాకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను మనీశ్‌ను చాలా మిస్‌ అవుతున్నా. తప్పుడు కేసులో తను జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా మనమంతా ఒక ప్రతిజ్ఞ చేయాలి. భారత దేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించేందుకు మన శక్తి సామర్థ్యాల మేర తప్పకుండా ప్రయత్నిద్దాం. శక్తిమంతమైన భారత్‌కు ఇది పునాదులు వేస్తుంది. దానివల్ల భారత్‌ నంబర్‌ వన్‌ దేశంగా నిలపాలన్న మన కల సాకారమవుతుంది. అది మనీశ్‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇక జాబిల్లిపై అడుగే తరువాయి

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీశ్‌ సిసోదియా అరెస్టయ్యారు. ఇప్పటిదాకా మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం మనీశ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్‌ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సిసోదియా భార్య మెడికల్‌ రికార్డులను పరిశీలించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తేలడంతో బెయిల్‌ పిటిషన్‌ విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు