Kolkata: హుక్కా బార్లపై నిషేధం.. కారణం అదే..!
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలోని హుక్కా బార్లు(hookah bars)పై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలోని హుక్కా బార్లు(hookah bars)పై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీం తెలిపారు. హుక్కా బార్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే ఆయా రెస్టారెంట్ల లైసెన్స్‌లను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ రద్దు చేస్తుందని హెచ్చరించారు. హుక్కాకు యువతను బానిసలుగా మార్చేందుకు అందులో కొన్ని మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయని.. వీటిని మూసివేయాలంటూ అభ్యర్థనలు రావడంతో తామీ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హుక్కాలో వాడే రసాయనాలు ఆరోగ్యానికి అత్యంత హానికరమైనందు వల్ల రెస్టారెంట్లన్నింటిలోనూ హుక్కా బార్లు మూసివేయాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో అధికారులు ఈ నిషేధాన్ని అమలుపరుస్తారని మేయర్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Smyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్