వామ్మో.. ఈ వెయిటింగ్ టైంలో DDLJ సినిమా సగం చూడొచ్చు..!

బెంగళూరు ట్రాఫిక్‌(Bengaluru traffic jam) కష్టాల గురించి ఓ ట్విటర్ యూజర్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. అందులో వెయిటింగ్ టైం చూసి నెటిజన్లు ఖంగుతిన్నారు. 

Published : 17 May 2023 15:38 IST

బెంగళూరు: ఐటీ నగరం బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru traffic jam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ట్రాఫిక్ కష్టాలు చెప్తూ నెటిజన్లు తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు. ఆ కష్టాలను మరిపించేలా బోలెడు మీమ్స్‌  చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ బెంగళూరు(Bengaluru) వాసి పెట్టిన స్క్రీన్‌ షాట్ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఒక రైడింగ్ యాప్‌లో చూపించిన వెయింటింగ్ టైం అవాక్కయ్యేలా చేస్తోంది.

అనుశాంక్‌ జైన్ అనే ట్విటర్ యూజర్ ఓ రైడింగ్ యాప్‌లో ఆటో బుక్‌ చేసుకున్నారు. డ్రైవర్‌ ఆ రైడ్‌(Auto Ride)ను యాక్సెప్ట్ చేశారు. అయితే 24 కి.మీ.కు 71 నిమిషాలు చూపించింది. ఆ సమయానికి ఆయన వస్తే గ్రేటే అంటూ రైడ్‌ వివరాలను జైన్‌ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో విమానంలో దిల్లీ నుంచి జైపుర్‌ వెళ్లిపోవచ్చు, డీడీఎల్‌జే సినిమాను ఇంటర్వెల్ వరకు చూసేయచ్చంటూ పోస్టులు పెట్టారు. అంతసేపు ఎదురుచూసుంటే జైన్‌ కూడా గ్రేటే అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. అయితే ఒక నిమిషం తర్వాత డ్రైవర్ రైడ్ రద్దుచేశారు.

ఇదే తరహాలో ఓ యువతి ఉద్యోగానికి వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. రైడింగ్ యాప్‌లో బుక్‌ చేసుకున్న బైక్‌ మీద ఆమె ఆఫీస్‌కు బయలద్దేరారు. అయితే మధ్యలో ట్రాఫిక్ ఎక్కువైంది. దాంతో ఆమె తన ల్యాప్‌ట్యాప్‌ తీసి పనిచేసుకోవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ చిత్రం వైరల్‌ అవుతోంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు