Lockdown: అక్కడ మద్యం హోండెలివరీకి ఓకే

గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు దిల్లీ ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టళ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా బుకింగ్స్‌.....

Updated : 01 Jun 2021 12:03 IST

దిల్లీ: గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు దిల్లీ ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టళ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా బుకింగ్స్‌ స్వీకరించి నేరుగా ఇంటికే మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాదారులకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు చేసింది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలు మద్యం దుకాణాల వద్ద గుమిగూడకుండా ఈ వెసులుబాటు కల్పించింది. మహమ్మారి కట్టడికి గత నెల రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమలు చేసిన దిల్లీ సర్కార్‌ నేటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.

దిల్లీలో మద్యం హోండెలివరీకి ముందు నుంచి అనుమతి ఉంది. అదీ ఈ-మెయిల్‌ లేదా ఫ్యాక్స్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే మాత్రమే డెలివరీ అందుతుంది. తాజాగా యాప్‌లు, ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా కూడా బుకింగ్స్ స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, దిల్లీలో ఉన్న మద్యం దుకాణాదారులందరూ హోండెలివరీకి అర్హులు కాదు. కేవలం ఎల్‌-14 లైసెన్స్‌లు ఉన్నవారికి మాత్రమే హోండెలివరీ చేయడానికి అనుమతి ఉంది. దిల్లీలో పాజిటివిటీ రేటు భారీ తగ్గిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు సడలింపులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మద్య హోండెలివరీకి ప్రభుత్వం అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని