భాజపాలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే

తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఇప్పటికే థౌసండ్‌ లైట్స్‌ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం భాజపాలో చేరగా.. తాజాగా అదే పార్టీకి చెందిన తిరుప్పరంకుంద్రం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. శరవణన్‌ ఆదివారం

Published : 15 Mar 2021 01:34 IST

చెన్నై: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఇప్పటికే థౌజెండ్‌ లైట్స్‌ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం భాజపాలో చేరగా.. తాజాగా అదే పార్టీకి చెందిన తిరుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే పి. శరవణన్‌ ఆదివారం భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌. మురుగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లా స్థాయి పార్టీ కార్యవర్గాల ఆధిపత్యం.. వేధింపుల కారణంగానే తాను డీఎంకే పార్టీని వీడుతున్నట్లు శరవణన్‌ తెలిపారు. కొన్నేళ్ల కిందట భాజపాలోనే ఉన్న ఆయన ఆ తర్వాత డీఎంకేలో చేరారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోన్న తరుణంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని