Pakistan: సరిహద్దుల్లో ఈ ఏడాది పాక్‌ డ్రోన్ల కదలికలు పెరిగాయ్‌: బీఎస్‌ఎఫ్‌

పాక్‌ నుంచి ప్రమాదకర స్థాయిలో డ్రోన్లు సరిహద్దులు దాటుతున్నాయి. బీఎస్‌ఎఫ్‌ మారుమూల ప్రాంతాలకు వెళ్లి గస్తీలు నిర్వహించినా ఇవి ఆగటంలేదు. 

Published : 14 Nov 2022 00:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఈ ఏడాది పాక్‌ వైపు నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాలతో వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగినట్లు భారత భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో డ్రోన్ల ముప్పు పెరుగుతోందని ఆందోళన బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ పంకజ్‌ కుమార్‌ సింగ్‌  ఆందోళన వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పెట్రోలింగ్‌ నిర్వహించినా.. యాంటీ డ్రోన్‌ పరికరాలను అమర్చినా.. ముష్కరులు వేరే మార్గాలను అన్వేషిస్తున్నట్టు తమ దర్యాప్తుల్లో తెలుస్తోందన్నారు. 

ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్‌ క్యాంపస్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్‌ ప్రయోగశాలను గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేశారు. పాక్‌ సరిహద్దుల్లో కూల్చేసిన డ్రోన్ల నుంచి సమాచారం వెలికి తీయడానికి ఇక్కడికి పంపుతారు. దీంతోపాటు డ్రోన్లను గుర్తించే టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో డ్రోన్‌ ఫ్లైట్‌పాత్‌లను గుర్తించడం, నేరగాళ్ల చిరునామాలు కనుగొనడం వంటి అంశాలపై భద్రతా సంస్థలు దృష్టిపెట్టాయి. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో దాదాపు 3,000 కిలోమీటర్ల మేరకు బీఎస్ఎఫ్‌ పహారా కాస్తోంది. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూలు దీని పరిధిలోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు